23వ వార్డు అభివృద్ధే నా లక్ష్యం:మద్ది బోయన శృతి సంతోష్
మెదక్, ఫబ్రవరి9(మనప్రజాప్రతినిధి):మెదక్ మున్సిపాలిటీ 23వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మద్ది బోయన శృతి సంతోష్ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకుంటూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.వార్డు సమగ్ర అభివృద్ధినే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగినట్లు ఆమె తెలిపారు. ప్రజల ప్రేమాభిమానంతో గెలిపిస్తే 23వ వార్డును మెదక్ పట్టణంలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రతి ఆడపిల్ల వివాహానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు...