•కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపు
సదాశివపేట,ఫిబ్రవరి6(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట పట్టణంలోని పాతకేరి ప్రాంతంలో 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత తరపున టి.జి. ఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో పులిమామిడి రాజు 12వ వార్డు ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాలను ప్రజలకు అందేలా కృషి చేశారని, అలాంటి సేవాభావం కలిగిన కుటుంబం నుండి పులిమామిడి మమత పోటీ చేయడం వార్డు ప్రజల అదృష్టమని పేర్కొన్నారు.ఈసారి బీసీ మహిళగా పులిమామిడి మమత కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారని, ఆమెను మరోసారి గెలిపిస్తే 12వ వార్డును మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ, ఓటర్లు చేతి గుర్తుకు ఓటు వేసి మమతను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి, చెర్యాల అంజన్న, పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు చాట్ల సిద్దన్న, 12వ వార్డు ఇంచార్జ్ వడ్ల బింబాధర్ చారి, కంది కృష్ణ, పిఎంఆర్ యువసేన నాయకులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.