manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 5:06 pm Editor : Mana Praja Prathinidhi

12వ వార్డు ప్రజలకు కృతజ్ఞతల వెల్లువ-భారీ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు మమత రాజు ధన్యవాదాలు

సదాశివపేట,ఫిబ్రవరి13(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు,తనను ఆశీర్వదించిన వార్డుప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.తన విజయానికి కారణమైన ప్రతి ఓటరుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ,“వార్డు అభివృద్ధే నా లక్ష్యం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె తనయుడు పులిమామిడి మనోజ్ ఆధ్వర్యంలో 12వ వార్డు ప్రజలు భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మైనారిటీ సోదరులు, పి.ఎం.ఆర్ యువసేన నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.విజయోత్సవంలో నినాదాలతో మార్మోగిన 12వ వార్డు, మమత రాజుకు లభించిన ప్రజాభిమానాన్ని మరోసారి చాటిచెప్పింది.