మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి16:
సిరిసిల్ల అశోక్, ఇల్లంతకుంట ఎస్సై మాట్లాడుతూ పులి వచ్చిందని ప్రచారం జరుగుతున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు. జనావాసాల్లోకి పులి రావడం అసాధ్యమని, ఎవరైనా అనుమానాస్పదంగా ఏదైనా జంతువును చూసి పులి అని తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు.ప్రస్తుతం పులి పక్క జిల్లాలోని చిన్నకోడూరు మండలం చౌడారం గుట్టల పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారని పేర్కొన్నారు. కాబట్టి పులి వచ్చింది అనే వదంతులను నమ్మి మీతో పాటు ఇతర గ్రామాల ప్రజల్లో భయాందోళనలు సృష్టించవద్దని, అపోహలు వ్యాప్తి చేయకుండా పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.