కాంగ్రెస్ విజయంపై ఆనందం వ్యక్తం చేసిన పులిమామిడి రాజు
సదాశివపేట,ఫిబ్రవరి16(మనప్రజాప్రతినిధి):సదాశివపేట పట్టణంలో జరిగిన 2026 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి మార్గదర్శకత్వంలో పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసిన ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కట్టుబడి ఉండటమే ప్రజల...