manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 10:12 am Posted by : Mana Praja Prathinidhi

ఆర్.సుహాసిని పిహెచ్‌.డి. పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు

మనప్రజాప్రతినిధి//సిద్ధిపేటజిల్లా, ఫిబ్రవరి 14:

గీతం విశ్వవిద్యాలయం, మాథమాటిక్స్ విభాగంలో  ఆర్. సుహాసిని తమ పిహెచ్‌.డి. పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.“నానోపార్టీకల్సతో కూడిన సాగే షీట్ ఫై మాగ్నెటోహైడ్రోడైనమిక్ (ఎం హెచ్ డీ ) మైక్రోపోలార్ ద్రవ ప్రవాహం పై ఒక సంఖ్యా అధ్యయనం ” అనే కీలకమైన అంశంపై అసోసియేట్ ప్రొఫెసర్ పరిశోదన పర్యవేక్ష్యకుడు డాక్టర్ ఆర్.శ్రీనివాస్ రాజు  పర్యవేక్షణలో పరిశోధన చేసిన ఆర్. సుహాసిని  న్యూటనియన్ కానీ ద్రవ గతీశాస్రం, వేడి, ద్రవ్యరాశి బదిలీ దృగ్విషయాల అధ్యనానికి గణనీయమైన తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంలో పర్యవేక్షకుడు డాక్టర్ ఆర్. శ్రీనివాస్ రాజు  మార్గదర్శనం, నిరంతర సహకారం, పరిశోధనపై చూపిన దిశానిర్దేశం మరియు శాస్త్రీయ దృక్పథం  ఆర్. సుహాసిని విజయానికి ప్రధాన బలమై నిలిచింది. పరిశోధనలో ప్రతి దశలోనూ ఆమె అందించిన ప్రోత్సాహం, సూచనలు మరియు సహకారం ఈ డాక్టరేట్ సాధనకు కీలకంగా మారాయి.సిద్దిపేట లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మాథమాటిక్స్ విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఆర్. సుహాసిని ఉద్యోగ బాధ్యతలతో పాటు పరిశోధనను సమానంగా కొనసాగిస్తూ ఈ విజయాన్ని సాధించడం విశేషం. ప్రయాణంలో ఆర్. సుహాసిని కి మరొక అత్యంత బలమైన తోడ్పాటు  భర్త ఎం. సిద్ధిరమేశ్వర్ నిరంతర ప్రోత్సాహం, ప్రతి అడుగులోనూ ఇచ్చిన మానసిక బలం. పరిశోధనలో ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమించడంలో ఆయన అందించిన మద్దతు, విజయానికి పునాది అయింది.ఆమె విజయం పై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్వి.సునీతప్రత్యేకశుభాకాంక్షలుతెలియజేస్తూ,“అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తూ, అత్యున్నతమైన డాక్టరేట్ స్థాయిని సాధించడం ఆర్. సుహాసిని పట్టుదల, కృషి, శాస్త్రీయ దృష్టికి నిదర్శనం. మా కళాశాలకే కాదువిద్యారంగానికే ఒక గర్వకారణం.”అని పేర్కొన్నారు.వైస్ ప్రిన్సిపల్ ఏ. దీప్తి, అధ్యాపకులు మరియు సిబ్బంది ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.డాక్టరేట్ పట్టా అందుకున్న ఆర్.సుహాసిని  కుటుంబ సభ్యులు, సహచర అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులు ఘనంగా అభినందించారు.