manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 1:55 pm Editor : Mana Praja Prathinidhi

ఇల్లంతకుంట యువజన సంఘాల అధ్యక్షుడిగా రేగుల కార్తీక్ ఎన్నిక

•యువత అభివృద్ధి, క్రీడలు–సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని నూతన అధ్యక్షుడి హామీ
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.ఫిబ్రవరి07
ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్వహించిన యువజన సంఘాల సమావేశంలో రేగుల కార్తీక్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన అధ్యక్షుడు రేగుల కార్తీక్ మాట్లాడుతూ యువజన సంఘాన్ని మరింత బలోపేతం చేసి యువతకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. గ్రామంలో క్రీడా పోటీలు, సేవా కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు, యువకులు కార్తీక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికైన అధ్యక్షుడిని సర్పంచ్ ఎం. రాజు, మాజీ అధ్యక్షుడు ఉప్పల అమరేందర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు మామిడి సంజీమ్, కునబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, ఎంపీటీసీ కొయ్యడ భాస్కర్, వార్డు సభ్యులు, యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.