manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 11:05 am Editor : Mana Praja Prathinidhi

రిలే నిరాహార దీక్షా శిబిరంధ్వంసం-గ్రామంలో ఉద్రిక్తత

•దీక్షను భంగపర్చే కుట్రలపై గ్రామస్తుల ఆగ్రహం-దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి23:
ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామంలో 11/6 కాలువ అసంపూర్తి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గత 14 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేశారు.
దీక్షను నీరుగార్చే ఉద్దేశంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు శిబిరం వద్దకు వెళ్లి టెంటును పూర్తిగా పడగొట్టి చిన్నాభిన్నం చేశారు. ఇదే ఘటన మూడు రోజుల క్రితం కూడా చోటుచేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఆ సమయంలో టెంట్‌కు చెందిన రెండు కట్టలు మాత్రమే పడగొట్టగా, ఈసారి మాత్రం మొత్తం శిబిరాన్నే నేలమట్టం చేశారు.దీక్షలో పాల్గొంటున్న రైతులు మరియు గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “మా సమస్యలను పరిష్కరించాలనే న్యాయమైన డిమాండ్‌తో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. ఇలాంటి చర్యలు మానవత్వానికి విరుద్ధం. మా కష్టాలు, మా బాధలు తెలియకపోవడం వల్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. గ్రామంలో మరింత అప్రమత్తత అవసరమని ప్రజలు అభిప్రాయపడ్డారు.