రిలే నిరాహార దీక్షా శిబిరంధ్వంసం-గ్రామంలో ఉద్రిక్తత

•దీక్షను భంగపర్చే కుట్రలపై గ్రామస్తుల ఆగ్రహం-దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి23:ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామంలో 11/6 కాలువ అసంపూర్తి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గత 14 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేశారు.దీక్షను నీరుగార్చే ఉద్దేశంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు శిబిరం వద్దకు వెళ్లి టెంటును పూర్తిగా పడగొట్టి చిన్నాభిన్నం చేశారు. ఇదే ఘటన మూడు రోజుల క్రితం కూడా చోటుచేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఆ...