రాష్ట్రస్థాయి కుంగ్ ఫు పోటీల్లో సిరిసిల్ల విద్యార్థినుల ప్రభంజనం
•ఇద్దరికీ బంగారు పతకాలు-జిల్లాకు గర్వకారణంమనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల,ఫిబ్రవరి08:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్ వేదికగా ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కుంగ్ ఫు, కరాటే పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. కే.ఆర్. కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ కుందేళ్ల రవి ఆధ్వర్యంలో పోటీలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి.స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ నుండి మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ పర్యవేక్షణలో పాల్గొన్న విద్యార్థినులు తమ తమ విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించారు. కంచర్ల శ్రీనిక బ్లాక్...