•మత్స్య సంపద పెంపే లక్ష్యం-మత్స్యశాఖ అధికారుల వెల్లడి
మెదక్ జిల్లా,ఫిబ్రవరి3(మనప్రజాప్రతినిధి)
మెదక్ జిల్లాలోని పోచారం రిజర్వాయర్‌లో మత్స్య సంపదను పెంపొందించాలనే లక్ష్యంతో ఆరు లక్షల రొయ్య పిల్లలను అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఎడి మల్లేశం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మత్స్య అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే పోచారం రిజర్వాయర్‌లో రొయ్య పిల్లల విడుదల చేపట్టామని తెలిపారు. ఇరిగేషన్ డీఈ, మత్స్యశాఖ చైర్మన్ గడప దేవేందర్, డైరెక్టర్ బిసా శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ, రిజర్వాయర్‌ను సమర్థవంతంగా వినియోగించుకొని మత్స్య సంపదను మరింత పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జేక్కుల శ్రీనివాస్, కృష్ణ, రాముల కృష్ణ, నరేష్, సంతోష్, పోచారం గ్రామ సర్పంచ్ ఎన్. సంజీవరావు సహా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.