manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 10:44 am Editor : Mana Praja Prathinidhi

లక్ష దీపాలతో దివ్య కాంతుల్లో మెరిసిన శ్రీ జగన్నాథ ఆలయం

•ఘనంగా మహాశివరాత్రి వేడుకలు-లక్ష దీపాలతో దేదీప్యమానమైన ఆలయ ప్రాంగణం
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి16
ముంబై నగరంలోని సాకేత్ సత్యనగర్‌లో ఉన్న శ్రీ జగన్నాథ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష దీపోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
కన్నుల పండుగగా దీపోత్సవం
ఆదివారం సాయంత్రం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించారు. ఆలయ ప్రాంగణమంతాలక్షలాది దీపాల కాంతులతో దేదీప్యమానంగా మెరిసిపోవడంతోఆప్రాంతమంత ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారి నామస్మరణ తో తమ మొక్కులను చెల్లించుకుంటూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాపెల్లి సత్యజీ, వికాస్ జీ, పాడి మణి, అరుణ్, రవి, స్వామి కులకర్ణి, సునీల్ నాయక్, ఉత్తమ్ సాహా తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయగా, మహాశివరాత్రి వేడుకలు సత్యనగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.