లక్ష దీపాలతో దివ్య కాంతుల్లో మెరిసిన శ్రీ జగన్నాథ ఆలయం
•ఘనంగా మహాశివరాత్రి వేడుకలు-లక్ష దీపాలతో దేదీప్యమానమైన ఆలయ ప్రాంగణంమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి16ముంబై నగరంలోని సాకేత్ సత్యనగర్‌లో ఉన్న శ్రీ జగన్నాథ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష దీపోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.కన్నుల పండుగగా దీపోత్సవంఆదివారం సాయంత్రం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించారు. ఆలయ ప్రాంగణమంతాలక్షలాది దీపాల కాంతులతో దేదీప్యమానంగా మెరిసిపోవడంతోఆప్రాంతమంత ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారి నామస్మరణ తో తమ మొక్కులను చెల్లించుకుంటూ ప్రత్యేక...