•యువవ్యాపారులకు ప్రోత్సాహం-స్థానికుల సందడి
సిద్దిపేటనియోజకవర్గం.ఫిబ్రవరి7:(మనప్రజాప్రతినిధి)
సిద్దిపేట పట్టణంలోని సీతారామాంజనేయ థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ వారాహి జ్యూస్ & ఐస్ క్రీమ్ పార్లర్ శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, అనంతుల నరేందర్ హాజరై రిబ్బన్ కట్ చేసి దుకాణాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావడం అభినందనీయమని, నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వాహకుల ను అభినందించారు.
ఈ కార్యక్రమాన్ని ప్రో. సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు