సూరంపల్లిలో వీధి కుక్కల దాడి-3 ఏళ్లచిన్నారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలింపు
•3ఏళ్లచిన్నారిపైదాడి-చికిత్సలోచిన్నారి,కుటుంబంలోఆందోళన •ప్రజలప్రాణభద్రతపైప్రశ్నలు-వెంటనేచర్యలుతీసుకోవాలని ప్రభుత్వానికిగ్రామస్తులడిమాండ్ సిద్దిపేటజిల్లా.దౌల్తాబాద్ మండలంఫిబ్రవరి13(మనప్రజాప్రతినిధి):సూరంపల్లి గ్రామంలో వీధి కుక్కల బీభత్సం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న మూడు సంవత్సరాల చిన్నారి మోక్షితపై కుక్కలు ఆకస్మికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.బాధిత చిన్నారి తండ్రి నవీన్ తెలిపిన వివరాల ప్రకారం, ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుక్కలు దాడి చేయగా, కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి చిన్నారిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స...