manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 7:36 am Editor : Mana Praja Prathinidhi

సైబర్ మోసాలపై కఠిన చర్యలు-మహిళల రక్షణకు ప్రాధాన్యం:ఎస్పీఎల్.సుబ్బరాయుడు

•ఎర్పేడు పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత గ్రామ అవగాహన సదస్సులు
మనప్రజాప్రతినిధి,ఏర్పేడుమండలం,ఫిబ్రవరి22:
జిల్లాలో మహిళల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, సైబర్ నేరాలు మరియు డిజిటల్ మోసాలపై ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నా మని ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.సమాజంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట జరిగే బెదిరింపులు, ఓటీపీ మోసాలు, ఫేక్ కాల్స్, అనుమానాస్పద లింకులు, అలాగే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రజలకు స్పష్టమైన సూచనలు అందించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా జరుగుతున్న కొత్త తరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం పంచుకోవద్దని, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.ఈ క్రమంలో ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై రవిశంకర్, సిబ్బందితో కలిసి పలుచోట్ల గ్రామ సభలు నిర్వహించి మహిళలకు, యువతకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్సై రవిశంకర్ తెలిపారు.పోలీసుల చైతన్య కార్యక్రమాలను గ్రామ ప్రజలు అభినందించారు.