•అగ్రహారంచెక్‌పోస్ట్.వద్ద”రూ.2 లక్షలుస్వాధీనం
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి07:
మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. ఈ క్రమంలో శనివారం రాత్రి అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ చెక్‌పోస్ట్‌లో నిర్వహించిన తనిఖీల్లో రూ. 2 లక్షల నగదు పట్టుబడింది.వేములవాడ నుండి సిరిసిల్ల వైపు వస్తున్న AP20 AE 1116 నంబర్ గల కారును ఆపి తనిఖీ చేయగా, వాహనంలో ఉన్న చిగురు వినోద్ (ఎదురుగట్ల గ్రామం, వేములవాడ మండలం) వద్ద సరైన పత్రాలు లేకుండా రూ. 2,00,000 నగదు గుర్తించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలిస్తు న్నందున SST బృందం ఇన్‌చార్జ్ ఎం.డి.సర్దం హుస్సేన్ పంచనామా నిర్వహించి నగదును స్వాధీనం చేసుకున్నారు.సిరిసిల్ల టౌన్ఇన్‌స్పెక్టర్ కె. కృష్ణ మాట్లాడుతూ, నగదుకు సంబంధించిన మూలాలు మరియు తరలింపు ఉద్దేశ్యంపై దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.