పరీక్షల సమయంలో ప్రణాళికాబద్ధంగా చదవాలి-చందుర్తి ఎస్ఐ జె.రమేష్

•సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవంలో విద్యార్థులకు మార్గదర్శనం –సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచనరాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి10(మనప్రజాప్రతినిధి):విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రానున్న వార్షిక పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని చందుర్తి ఎస్ఐ జె. రమేష్ సూచించారు. మంగళవారం చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ‘అంతర్జాతీయ సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం’ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ పరీక్షల సమయం అత్యంత కీలకమని, ఈ సమయంలో సమయాన్ని వృథా చేయకుండా ప్రతి నిమిషాన్ని చదువుకే కేటాయించాలని...