•6వ వార్డులో ఇంటింటి ప్రచారంతో దూసుకెళ్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి
సదాశివపేట,ఫిబ్రవరి4(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట పట్టణం 6వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి నాగుల మణెమ్మ, తనను ఆదరించి గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అండగా ఉంటూ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణానగర్ కాలనీలోని 6వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ, తనకు ఆశీర్వాదం అందించాలని కోరుతూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు నాగుల విజయకుమార్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో 6వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కోల్కూరు సర్పంచ్ నాగరాజు, వెల్టూరు, కొలుకూరు మాజీ సర్పంచ్ సత్యనారాయణ, మాణిక్యం, బీఆర్‌ఎస్ నాయకులు గంజి రమేష్, శ్రీశైలం, కాజా, నాసిర్, బాబా మంబిగారి ఆంజనేయులు, ఆనంద్, నాగరాజు తదితరులు పాల్గొని అభ్యర్థికి సంఘీభావం తెలిపారు.