శ్రీ సంగమేశ్వర ఆలయంలో ఘనంగా 11వ వార్షికోత్సవ ఉత్సవాలు

•108 కలశాల ఊరేగింపు,పల్లకి సేవతో భక్తి వైభవంమనప్రజాప్రతినిధ,//సదాశివపేట,ఫిబ్రవరి6.సదాశివపేట పట్టణంలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో 11వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ శ్రీ శ్రీమాధవానంద సరస్వతి దివ్య ఆశీస్సులతో ఆలయ పూజారులు జి. మోహన్‌రావు, బి.ఎన్. శంకర్రావు, నారాయణరావుల ఆధ్వర్యంలో ఉదయం దీపస్థాపన, ధ్వజారోహణం, గణపతి పూజ, స్వస్తి పుణ్యవాచనం, హోమం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మహిళలతో సామూహికంగా 108 కలశాల ఊరేగింపును శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం నుండి గాంధీ చౌక్ మీదుగా తబల వాయిద్యాలు, శివనామస్మరణ, భజనల...