రైతు సంక్షోభాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్

•రుణమాఫీ,పంట బీమాపై మౌనం-రైతులపై మరో ద్రోహం •ఆకలి, అప్పులు, ఆత్మహత్యల మధ్య రైతును విస్మరించిన విధానాలపై తీవ్ర విమర్శలు సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//ఫిబ్రవరి3ఆకలి, అప్పులు, ఆత్మహత్యలతో అల్లాడుతున్న రైతుకు కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని తెలంగాణ రైతు రక్షణ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మారెడ్డి రాంలింగారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతు ఆకాంక్షలకు పూర్తిగా విరుద్ధంగా రూపొందిన తాజా కేంద్ర బడ్జెట్ రైతుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆయన పేర్కొన్నారు.గిట్టుబాటు ధరలు లేని పంటలు, ప్రైవేట్ అప్పుల భారంతో నలిగిపోతున్న రైతులు, ప్రకృతి వైపరీత్యాలతో...