కుక్క కాటు ఇంజెక్షన్ అనంతరం చిన్నారి మృతి
•ప్రభుత్వాసుపత్రిలో వైద్య నిర్లక్ష్యంపై అనుమానాలు..కుటుంబ సభ్యుల ఆగ్రహంమనప్రజాప్రతినిధి//కామారెడ్డి.ఫిబ్రవరి2కామారెడ్డి పట్టణంలోని అయ్యప్పనగర్‌కు చెందిన క్రితారా శ్రీ (2సంవత్సరాలు6నెలలు) అనే చిన్నారి కుక్క కాటు నివారణ ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే మృతి చెందడం కలకలం రేపింది.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, కుక్క కాటుకు గురైన చిన్నారికి ఇప్పటికే రెండు డోసుల రేబీస్ ఇంజెక్షన్లు పూర్తయ్యాయి. ఆదివారం మూడో డోస్ కోసం తల్లిదండ్రులు అర్చన, రమేశ్ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా, ఇంజెక్షన్ వేసిన వెంటనే చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు.వెంటనే వైద్యులు చికిత్స అందించినప్పటికీ చిన్నారి...