ఎన్నికల ఖర్చులపై ఎన్నికల సంఘం ఫోకస్
•నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:అభ్యర్థులకు అధికారుల హెచ్చరికమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి04సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల నిర్వహణపై అవగాహన కల్పించేందుకుఅధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బుధవారం స్థానిక సి.నా.రె. కళాభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల నియమావళి అమలు, వ్యయ నియంత్రణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.అభ్యర్థులు ప్రతిరోజూ చేసే ఖర్చులను తప్పనిసరిగా డే టు డే అకౌంట్స్‌లో నమోదు చేయాలని, షాడో రిజిస్టర్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల వ్యయాలకు ప్రత్యేకంగా తెరిచిన బ్యాంక్ ఖాతా...