manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 8:44 am Posted by : Mana Praja Prathinidhi

ఇందుప్రియల్‌లో ఉచిత పశువైద్య శిబిరం ఘన విజయం

పాడి రైతులకు వరంగా పశుసంవర్ధక శాఖ సేవలు – సర్పంచ్ వీరమ్మ స్వాతి స్వామి

(మనప్రజాప్రతినిధి)ఫిబ్రవరి3
సిద్దిపేట జిల్లా, దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామంలో పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని డాక్టర్ పరశురాం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ వీరమ్మ స్వాతి స్వామి ప్రారంభించారు.ఈ శిబిరంలో భాగంగా పశువులకు గర్భకోశ నివారణ చికిత్సలు, గర్భ నిర్ధారణ పరీక్షలు, సాధారణ వైద్య సేవలు అందించడంతో పాటు దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సేవల వల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ వీరమ్మ స్వాతి స్వామి మాట్లాడుతూ, రైతులు ఉచిత పశువైద్య శిబిరాలు, గోపాలమిత్ర సేవలను పూర్తిగా వినియోగించుకొని పశుసంపదను ఆరోగ్యంగా ఉంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, వి.ఎల్.ఓ సుదర్శన్ పాణి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ వేంపల్లి కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లలిత కృష్ణ, సూరంపల్లి ప్రవీణ్ కుమార్, గోపాలమిత్ర సూపర్వైజర్ భాస్కర్ గౌడ్, ఓఎస్ నర్సింలు, శిల్ప, గోపాలమిత్రులు హర్షద్ స్వామి, పాడి రైతులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.