ఇందుప్రియల్‌లో ఉచిత పశువైద్య శిబిరం ఘన విజయం

•పాడి రైతులకు వరంగా పశుసంవర్ధక శాఖ సేవలు – సర్పంచ్ వీరమ్మ స్వాతి స్వామి (మనప్రజాప్రతినిధి)ఫిబ్రవరి3సిద్దిపేట జిల్లా, దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామంలో పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని డాక్టర్ పరశురాం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ వీరమ్మ స్వాతి స్వామి ప్రారంభించారు.ఈ శిబిరంలో భాగంగా పశువులకు గర్భకోశ నివారణ చికిత్సలు, గర్భ నిర్ధారణ పరీక్షలు, సాధారణ వైద్య సేవలు అందించడంతో పాటు దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు....