manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 7:32 am Posted by : Mana Praja Prathinidhi

సర్పంచుల సమస్యల పరిష్కారమే లక్ష్యం – రాజకీయాలకు అతీతంగా పోరాటం

•సిద్దిపేటజిల్లాసర్పంచులసంఘంఅధ్యక్షుడిగాకొన్యాలబాల్ రెడ్డి ఏకగ్రీవఎన్నిక…
మనప్రజాప్రతినిధి,కొండపాకమండలం:ఫిబ్రవరి22
సర్పంచుల సమస్యల పరిష్కారం, నిధులు–విధుల సంరక్షణ కోసం రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తానని కొన్యాల బాల్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సిద్దిపేట జిల్లాసర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ములుగు మండలం క్షీరసాగరం సర్పంచ్ అయిన ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కొండపాక శివారులోని హోటల్ వన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన జిల్లా సర్పంచుల సమావేశంలో రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికప్రక్రియ నిర్వహించి బాల్ రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించారు.సభలో భూమన్న యాదవ్ మాట్లాడుతూ, సర్పంచుల హక్కులు, బాధ్యతలు, నిధుల పరిరక్షణ కోసం సంఘం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. 1995 నుంచి ఉమ్మడి రాష్ట్రం కాలం నుండి ఇప్పటివరకు సర్పంచుల సమస్యలపై సంఘం నిరంతరం స్పందిస్తూ పోరాటం చేస్తోందన్నారు.
నూతన అధ్యక్షుడు బాల్ రెడ్డి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లాలోని సర్పంచులకు, రాష్ట్ర సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో సర్పంచుల సంక్షేమం కోసం రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు క్రమశిక్షణతో పనిచేస్తానని చెప్పారు. జిల్లా కేంద్రంలో సర్పంచుల సౌకర్యార్థం సంఘం కార్యాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా చింతల శ్రీనివాస యాదవ్, ఉపాధ్యక్షులుగా శ్రీమతి ఓడేమ్ మౌనిక రెడ్డి, సందుల బాల పోచయ్య, కార్యదర్శులుగా మిట్టంపల్లి రవళి, దామర మల్లేశం, కుంచం లతాయాదవ్, జాయింట్ సెక్రటరీలుగా శనిగారం సత్యనారాయణ, బండ్ల సుజాత, మంచాల నవీన్ గౌడ్, అధికార ప్రతినిధులుగా ఎత్తబోయిన శ్రీనివాస్ ముదిరాజ్, గొల్లపల్లి పద్మ ఆంజనేయులు ఎన్నికయ్యారు.గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం సర్పంచుల సంఘం కన్వీనర్‌గా వెంకన్నగారి వెంకటరెడ్డిని నియమించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిట్కూరి కమలాకర్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పూల బాలకృష్ణారెడ్డికి భూమన్న యాదవ్ నియామక పత్రాలు అందజేశారు.న్యాయ సలహాదారులు వీరభద్ర ఆచార్య, అశోక్ రెడ్డి, ప్రసాదరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.