బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
•చాకలి ఐలమ్మ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా పోరాటంకొనసాగిస్తాం. •కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి.(సిద్దిపేటనియోజకవర్గం)ఫిబ్రవరి27: సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని జప్తి నాచారం గ్రామంలో కుమ్మెర ఘటనకు నిరసనగా గ్రామస్థుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కొండపాక మండల ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ముస్త్యాల శ్రీకాంత్ మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అగ్రకుల అహంకారంతో బీసీ దళిత కుటుంబానికి చెందిన వారిపై అమానుషంగా దాడి చేసి...