ఇల్లంతకుంట గ్రామంలో వార్డు సమస్యలపై సర్పంచ్ క్షేత్రస్థాయి పరిశీలన
•వార్డు వారీగా సమస్యలపై దృష్టి-ఇల్లంతకుంటలో సర్పంచ్ తనిఖీలు•పాముల భయం నుంచి తాగునీటి వరకు-ఇల్లంతకుంటలో సమస్యల పరిశీలన•ప్రజల భద్రతకు ప్రాధాన్యం-సమస్యలపై తక్షణ చర్యలు: సర్పంచ్ మామిడి రాజుమనప్రజాప్రతినిధి//మనకొండూరు.2ఫిబ్రవరిఇల్లంతకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని 1,2,3,12 వార్డుల్లో నెలకొన్న పలు సమస్యలను గ్రామ సర్పంచ్ మామిడి రాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆయన వార్డుల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు.ఈ సందర్భంగా పాముల భయం, కరెంటు తీగలపై పెరిగిన చెట్లు, ప్రమాదకర స్థితిలో ఉన్న పాత ఇండ్ల తొలగింపు, తాగునీటి సమస్య, పారిశుధ్య...