manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 4:24 pm Editor : Mana Praja Prathinidhi

ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

42 కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమలు
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం,ఫిబ్రవరి23
సిద్దిపేట జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా భద్రతా చర్యలను కఠినతరం చేశారు. ఈ మేరకు రష్మీ పెరుమాళ్, పోలీస్ కమిషనర్.అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని మొత్తం 42 పరీక్షా కేంద్రాల పరిధిలో బీఎన్‌ఎస్‌ఎస్ –2023 సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఫిబ్రవరి 25,2026 నుండి మార్చి 18,2026 వరకు ప్రతిరోజూ ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడరాదని స్పష్టం చేశారు.
పరీక్షల సమయంలో కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్-దుకాణాల ను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల నిర్వహణకు ఎలాంటి అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పోలీసులు నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉంటారని వెల్లడించారు.
విద్యార్థులు పరీక్ష సమయానికి కనీసం గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కమిషనర్ సూచించారు.