అమరవీరులకు వంతడుపుల గ్రామ యువకుల ఘన నివాళి
•కొవ్వొత్తుల ర్యాలీతో పుల్వామా వీరులను స్మరించిన గ్రామ ప్రజలుమనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి16భారతదేశాన్ని కలచివేసిన పుల్వామా ఉగ్రదాడి (ఫిబ్రవరి14 2019)లో ప్రాణత్యాగం చేసిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్)కు చెందిన 40 మంది అమరవీరులను స్మరించుకుంటూ వంతడుపుల గ్రామంలో యువకులు ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా యువనేత చిమ్మన గొట్టు శ్రీనివాసు మాట్లాడుతూ పుల్వామా దాడి దేశ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిందని, దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగంఎప్పటికీ మరువలేనిదని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ వారి త్యాగాన్ని స్మరించుకోవడం...