manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 5:12 pm Editor : Mana Praja Prathinidhi

ఒక్క ఓటుతో విజయం కైవసం-చెదరని గుండె ధైర్యంతో గెలిచిన హరిత

మెదక్ జిల్లా,ఫిబ్రవరి13(మనప్రజాప్రతినిధి):
మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన హరిత, ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.ఆమెకు ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రావు ఉండగా, బీజేపీ.ఎంఐఎం పార్టీల అభ్యర్థులు కూడా పోటీలో నిలిచారు. ఫలితాల ప్రకటన వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఎన్నికల ప్రచారంలో హరిత గడపగడపకు వెళ్లి ఓటర్లను కలుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గతంలో రెండు సార్లు ఓటమి చవిచూసినా ఎక్కడా ధైర్యం కోల్పోకుండా ప్రజల విశ్వాసాన్ని నమ్ముకుని ముందుకు సాగిన ఆమెకు ఈసారి విజయం వరించింది.విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన హరిత, “నామీద విశ్వాసం ఉంచి గెలిపించి న వార్డు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తాను. నా వార్డు ప్రజలే నాకు దేవుళ్లు” అని ఆనందం వ్యక్తం చేశారు.