రహీంఖాన్‌పేట కాలువపై మోటర్లు తొలగించాలి: గ్రామస్తుల డిమాండ్

•అనంతారం గ్రామపంచాయతీ సర్పంచ్‌ను కలిసి వినతిమనకొండూరు,ఫిబ్రవరి25(మనప్రజాప్రతినిధి):ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ కముటం లావణ్య రాములు, ఉప సర్పంచ్ గడ్డమీది పద్మ ఆధ్వర్యంలో రహీంఖాన్‌పేట కాలువ నుండి వచ్చే నీటిని కొంతమంది నిరుపయోగంగా వినియోగిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో అనంతారం గ్రామపంచాయతీ సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేష్‌ను కలిసి సమస్యను వివరించారు.సర్పంచ్ కముటం లావణ్య రాములు మాట్లాడుతూ, తమ గ్రామ చెరువులో ఏర్పాటు చేసిన మోటార్లను గ్రామస్తుల సహకారంతో ఇప్పటికే తొలగించామని తెలిపారు. అలాగే కాలువ వెంట ఉన్న మోటార్లను కూడా తీసివేశా...