•12వ వార్డులో కాంగ్రెస్ జోరు ప్రచారం-అభివృద్ధే ప్రధాన అజెండా
మనప్రజాప్రతినిధి//సదాశివపేట,ఫిబ్రవరి6
సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఉదయం నుంచే వార్డు ప్రజలను కలుస్తూ గతంలో తాము చేసిన సేవలను గుర్తుచేస్తూ, రానున్న రోజుల్లో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.గత 20 సంవత్సరాలుగా పదవుల్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు వార్డు అభివృద్ధిని పట్టించుకోలే దని, ఇప్పటికే ప్రజలు వారిపై విసుగుచెంది తమకు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. అధికారంలో లేకపోయినా గతంలో ఎన్నో పనులు చేశామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.తూర్పు నిర్మల జగ్గారెడ్డి సహకారంతో 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని పులిమామిడి మమత ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి, కంది కృష్ణ, వడ్ల బింబధర్ చారీతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.