ఫీజుల పేరుతో హాల్ టికెట్ల నిలిపివేత అన్యాయం
•విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి – అసిస్టెంట్ కలెక్టర్‌కు వినతిమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి23జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఫీజుల పేరుతో హాల్ టికెట్లు నిలిపివేస్తున్న ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది.ఈవ్యవహారంపై కంచర్ల రవి గౌడ్ తీవ్రంగా స్పందిస్తూ, సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఫీజులు పూర్తిగా చెల్లించకపోతే హాల్ టికెట్లు ఇవ్వబోమని కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. పరీక్షల సమయంలో ఈ విధమైన చర్యలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం...