యాసంగి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలి: భూమల్ల అనిల్ కుమార్, భారతీయ జనతా పార్టీ

మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి14యాసంగి పంట పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడిచినా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫల మైందని ఆయన విమర్శించారు.ఎన్నికల సమయంలో రైతులకు రైతు భరోసా పేరుతో రూ.15,000 అందిస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని, కౌలు రైతులకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున ఇస్తామని చెప్పిన హామీ కూడా అమలు కాలేదని అన్నారు....