యువత రాజకీయాల్లోకి రావాలి

– షారుక్ ఖాన్‌కు వెల్లువెత్తుతున్న ప్రజాధారణ మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్, ఫిబ్రవరి 6: నారాయణఖేడ్ మున్సిపాలిటీ 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షారుక్ ఖాన్‌కు రోజురోజుకు ప్రజాధారణ పెరుగుతోంది. యువత రాజకీయాల్లోకి రావాలన్న ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా షారుక్ ఖాన్ నిలుస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 12వ వార్డులో ఇంటింటా తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని...