మనప్రజాప్రతినిధి/రాజన్నసిరిసిల్ల మార్చి, 05
అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం అంతర్గత ఫిర్యాదుల కమిటీ మరియు జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్ఎస్) విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కోనరావుపేట మండల తహసీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ శ్రీమతి బి. వరలక్ష్మి, చంద్రగిరి గ్రామ సర్పంచ్ శ్రీమతి ఎం. సంజన మహేష్, బ్యూటిషియన్ శ్రీమతి ఆర్. లీనా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రగిరి గ్రామ సర్పంచ్ శ్రీమతి ఎం. సంజన మహేష్ మాట్లాడుతూ మహిళలు స్వశక్తి స్వరూపిణులని పేర్కొన్నారు. విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుని అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.
కోనరావుపేట మండల తహసీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ శ్రీమతి బి. వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థానాలకు ఎదగాలని, సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు.
బ్యూటిషియన్ శ్రీమతి ఆర్. లీనా మాట్లాడుతూ విద్యార్థులు ఎవరి మీదనూ ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగి సాధికారతను సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి. లావణ్య, మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. శోభారాణి, ఎన్‌ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీమతి ఎం. శకుంతల, స్టాఫ్ సెక్రటరీ శ్రీ జి. శ్రీధర్ రావు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ. ప్రసాద్, టి ఎస్ కె సి కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. కృష్ణ ప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ కె. వై. కరుణ, తిరుపతి, నర్సయ్య, ఫకీర్ బాబా, గణేష్, రాధా, నిర్మల, పద్మతో పాటు కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.