manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 3:42 am Editor : Mana Praja Prathinidhi

గుర్రాలగొంది గ్రామంలో ఘనంగా శ్రీ మహా రేణుక ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవాలు

•ఎల్లమ్మదేవాలయంలోవంటశాలగది ఏర్పాటుకుముందుకువచ్చిన నాయకులు.యువకులు.
సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//మార్చి14.
గుర్రాలగొందిగ్రామంలోశ్రీమహారేణుకఎల్లమ్మదేవాలయవార్షికోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు,గ్రామ పెద్దలు ప్రత్యేక ఆహ్వానం మేరకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ మహా రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలు, ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా దేవాలయ ప్రాంగణంలో వంట కార్యక్రమాల కోసం కిచెన్ రేకుల షెడ్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ వంటశాల గది ఏర్పాటును మార్క సతీష్ కుమార్, మార్క రాహుల్ గౌడ్, మార్కం నిదున్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే దిశగా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.