గుర్రం కృష్ణారెడ్డికి ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం
•29 ఏళ్ల సేవలకు ముగింపు–గుర్రం కృష్ణారెడ్డికి భావోద్వేగ వీడ్కోలు మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజిల్లా.మార్చి1మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎన్గల్)లో ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించిన గుర్రం కృష్ణారెడ్డి గారి ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం పాఠశాల ప్రాంగణంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజల సమక్షంలో కార్యక్రమం హృదయాన్ని హత్తుకుంది.ముఖ్య అతిథులుగా హాజరైన డిటిఎఫ్ పూర్వ అధ్యక్షులురఘుశంకర్ రెడ్డి, మండల విద్యాధికారి వినయ్ కుమార్ మాట్లాడుతూ… కృష్ణారెడ్డి గారు విద్యా రంగంలో చూపిన అంకితభావం అభినందనీయం అన్నారు. ఆయన విద్యార్థుల అభివృద్ధి కోసం చేసిన...