సదాశివపేటలో నకిలీ సిగరెట్ల దందా కలకలం

•గోల్డ్ ప్లేక్ లైట్స్ పేరుతో డూప్లికేట్ విక్రయంసదాశివపేట,మార్చి05(మనప్రజాప్రతినిధి):సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలో నకిలీ సిగరెట్ల దందా జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రముఖ సంస్థ ఐటీసీ లిమిటెడ్ కు చెందిన గోల్డ్ ఫ్లాక్ లైట్స్ బ్రాండ్ పేరుతో డూప్లికేట్ సిగరెట్లు విక్రయమవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. పట్టణంలోని పలు రిటైల్ దుకాణాల్లో ఈ నకిలీ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.అసలు ప్యాకెట్‌లతో పోలిక… వినియోగదారులు గందరగోళంఅసలు బ్రాండ్‌కు పోలికగా ప్యాకింగ్ ఉండటంతో సాధారణ వినియోగదారులు సులభంగా మోసపోతున్న పరిస్థితి నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం...