కరీంనగర్‌లో హేమోఫిలియా అవగాహన-ఉచిత ఫ్యాక్టర్ టెస్ట్ & ఫ్యాక్టర్-8 పంపిణీ

మనప్రజాప్రతినిధి//కరీంనగర్.మార్చి9,పెద్దపల్లి హేమోఫిలియా చాప్టర్ ఆధ్వర్యంలో, ఇంటస్ ఫౌండేషన్ సహకారంతో కరీంనగర్‌లోని సిటీ ఆసుపత్రిలో ఫ్యాక్టర్ టెస్ట్ మరియు ఉచిత ఫ్యాక్టర్-8 పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.హేమోఫిలియా అనేది అరుదైన జన్యు సంబంధిత (వంశపారం పర్యంగా సంక్రమించే) రక్తస్రావ వ్యాధి. ఈ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, బాధితులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పెద్దపల్లి హేమోఫిలియా చాప్టర్‌కు చెందిన 60 మందికి పైగా బాధితులకు పరీక్షలు నిర్వహించారు. కరీంనగర్ సిటీ ఆసుపత్రి వైద్యులు...