అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా
•అమ్మ ప్రేమను ప్రతిబింబించిన సాంస్కృతిక కార్యక్రమాలు – ఆటల పోటీల్లో విద్యార్థులు, తల్లుల ఉత్సాహభరిత పాల్గొనడంమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.మార్చ్9మండల పరిధిలోని దుద్దెడ గ్రామంలో గల సాయి కృప విద్యాలయంలో శనివారం స్కూల్ హెడ్‌మాస్టర్ వనజ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్త్రీజాతి ఔన్నత్యం, ఆమెలోని ప్రేమ స్వరూపం గురించి వివరిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ తల్లులతో కలిసి ఆటల పోటీలలో పాల్గొని ఆనందంగా గడిపారు. అలాగే అమ్మ ప్రేమను ప్రతిబింబించే నృత్య ప్రదర్శన చేసి స్త్రీమూర్తుల...