మనప్రజాప్రతినిధి//మఠంపల్లి : మార్చి 23
నేరేడుచర్ల ఆర్టిఐ మండల అధ్యక్షులు నందిపాటి గురవయ్య.*
సూర్యాపేట జిల్లా, మఠంపల్లి మండలంలో మంగళవారం ఉదయం 10 గంటలకు సమాచార హక్కు రక్షణ చట్టం – 2005 ఐదవ రాష్ట్ర మహాసభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి రాష్ట్రసమాచార కార్యకర్తలు, అధికారులు, సామాజికవేత్తలు, ప్రజాసంఘాల నాయకులు హాజరుకానున్నారు. ఇట్టి కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం దాని విధివిధానాలు, లోకాయుక్త ,మానవ హక్కులు మొదలైన వాటిపై వివరణ ఇవ్వడం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి మన నేరేడుచర్ల ఆర్టిఐ కార్యకర్తలు – సామాజిక కార్యకర్తలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నేరేడుచర్ల మండలం సమాచార హక్కు రక్షణ చట్టం -2005 అధ్యక్షులు నందిపాటి గురవయ్య తెలిపారు.