manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 2:06 pm Posted by : Mana Praja Prathinidhi

“దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితం” – ప్రధానోపాధ్యాయులు సూరంపెల్లి రేఖ

•ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహణ
సిద్దిపేటఅర్బన్ మండలం,ఇమాంబాద్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల
మనప్రజాప్రతినిధి/సిద్దిపేటనియోజకవర్గం.మార్చ్4
సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని ఇమాంబాద్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం స్థానిక స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూరంపెల్లి రేఖ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వయం పరిపాలన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, ఉపాధ్యాయుల కష్టాలు పిల్లలకు అవగాహన అవుతాయని తెలిపారు. అలాగే విద్యార్థులకు స్టేజ్ భయం తొలగిపోవడంతో పాటు బాధ్యతా భావం పెరుగుతుందని చెప్పారు. దేశ భవిష్యత్తు తరగతి గదులలోనే నిర్మితమవుతుందని, కాబట్టి విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ ఉపాధ్యాయులుగా,బాధ్యతాయుత పౌరులుగా రాణించాలని ఆకాంక్షించారు.స్వయం పరిపాలనలో భాగంగా కె. విశ్వతేజను డిఈఓ గా, ఎం. కృష్ణవేణిని ఎంఈఓ గా, జి. శ్రీకరిని పాఠశాల హెడ్‌మాస్టర్‌గా నియమించగా, ఇతర విద్యార్థులు ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు బి.రాకేష్, బి.రోజా పర్యవేక్షించారు.