manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 6:10 am Posted by : Mana Praja Prathinidhi

తపస్పల్లి డ్యాం నుండి కొండపాక మండలానికి డి-ఫోర్ కాలువ ద్వారా నీటి విడుదల

•రైతులకు అండగా బిఆర్ఎస్ నాయకుడు అనంతుల ప్రశాంత్
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.మార్చ్6
తపస్పల్లి డ్యాం నుండి కొండపాక మండలంలోని పలు గ్రామాల చెరువులకు డి-ఫోర్ కాలువ ద్వారా నీటి సరఫరాకు పూడిక మట్టి, కలుపు మొక్కలు అడ్డంకిగా మారడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బిఆర్ఎస్ నాయకుడు అనంతుల ప్రశాంత్ దృష్టికి తీసుకువచ్చారు.రైతుల సమస్య తెలుసుకున్న అనంతుల ప్రశాంత్ వెంటనే స్పందించి, మూడు రోజులుగా తన సొంత ఖర్చుతో హిటాచీ యంత్రాన్ని ఏర్పాటు చేసి కాలువలో పూడికతీత పనులు చేపట్టించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా రైతులకు సహకరించారు.అదేవిధంగా డి-ఫోర్ కాలువ ద్వారా రావలసిన నీటి సరఫరా నిలిచిపోవడంతో సంబంధిత డిఈ అధికారులతో మాట్లాడి తపస్పల్లి డ్యాం నుండి కొండపాక మండల రైతులకు కాలువ ద్వారా నీటి విడుదలకు చర్యలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో అనంతుల సంజయ్ కృష్ణ, బొద్దుల తిరుపతి, రేపాక స్వామి (హిటాచీ), ఆరుట్ల కనకరాజు, పోయిల శ్రీనివాస్, బైరూజు నరసింహచారి, గణపురం రాజు, రమేష్, కిషన్, డబ్బేట పోశయ్యతో పాటు పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.రైతులు తమ సమస్యను వెంటనే పరిష్కరించి పూడికతీత పనులు చేపట్టి కాలువ ద్వారా నీటి విడుదలకు సహకరించిన అనంతుల ప్రశాంత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.