•రావురూకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//మార్చ్9
సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావురూకుల పాఠశాలలో అంతర్జర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రాజు ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు కలిసి మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, మహిళల శక్తి, స్ఫూర్తి ముందుతరాలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. మహిళల గొప్పతనం, త్యాగం, సేవా భావం సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలోఉపాధ్యాయులు. యం.లక్ష్మణ్, గంగభగీరథి. విజయలక్ష్మి,సంగీత,ఆర్.మహేందర్ రెడ్డి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.