manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 7:40 am Posted by : Mana Praja Prathinidhi

ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభం

•వేసవిలో సేవా కార్యక్రమానికి శ్రీకారం.

వెలికట్ట క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఏప్రిల్22
వెలికట్ట గ్రామ పరిధిలోని క్రాస్ రోడ్ వద్ద మంగళవారం గ్రామ సర్పంచ్ బూరుగుల మానస సురేందర్ రావు ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో వందలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సింలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసవి లింగారావు, ఉప సర్పంచ్ అమ్ముల పరశురాములు, వార్డు సభ్యులు ముత్యంరావు, అమ్ముల భాస్కర్, నాయకులు మంచాల కనక రాములు, కొమురవెల్లి రాజు, బూరుగుల నరేందర్ రావు, సిద్ధులు తదితరులు పాల్గొన్నారు…