manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 12:52 pm Editor : Mana Praja Prathinidhi

దీక్ష జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫలితాల ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో దీక్ష విద్యార్థుల అద్భుత ప్రతిభ

రికార్డు ఫలితాలతో మరోసారి సత్తా చాటిన దీక్ష”

“అన్ని విభాగాల్లో టాప్ మార్కులతో కళాశాలకు కీర్తి”
•ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో రికార్డు మార్కులు – స్టేట్ ర్యాంక్ సైతం సొంతం
సిద్దిపేటనియోజకవర్గం,ఏప్రిల్13(మనప్రజాప్రతినిధి):
ఈసారి విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో దీక్ష జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు. అన్ని విభాగాల్లోనూ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి కళాశాల ప్రతిష్ఠను మరింతగా పెంచారు.
జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించిన ఒక విద్యార్థి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. అదేవిధంగా 467, 467, 466, 466, 465, 465, 465, 464, 464, 464, 461, 461, 460, 460, 460 మార్కులతో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. 400కు పైగా మార్కులు సాధించిన వారు సుమారు 75 మంది ఉన్నారు.
జూనియర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 436 మార్కులు అత్యధికంగా నమోదు కాగా, 434, 433, 431, 431, 430, 430, 424, 423, 423, 421 మార్కులు సాధించిన విద్యార్థులు కూడా విశేష ప్రతిభ కనబరిచారు.
సీనియర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 992 మార్కులు అత్యధికంగా నమోదయ్యాయి. తదుపరి 991, 991, 991, 988, 988, 987, 986, 982, 982 మార్కులు సాధించి విద్యార్థులు ప్రతిభను చాటుకున్నారు.
సీనియర్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 984 మార్కులు అత్యధికంగా నమోదు కాగా, 983, 980, 972, 971, 971, 970, 962, 960 మార్కులతో పలువురు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.