చిన్నారులకు ఉచిత హృదయ పరీక్షల శుభావకాశం.
•ఏప్రిల్ 23, 24 తేదీలలో ఉచిత శిబిరం – పరీక్షల నుంచి శస్త్రచికిత్సల వరకు పూర్తిగా ఫ్రీ సేవలుసిద్దిపేటనియోజకవర్గం.కొండపాక మండల్, ఏప్రిల్ 17:కొండపాక శివారులోని శ్రీ సత్య సాయి సంజీవని హాస్పిటల్స్ బాల హృదయ సంరక్షణ పరిశోధనా కేంద్రంలో ఈ నెల 23, 24 తేదీలలో ఉచిత బాల హృదయ పరీక్ష శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో చిన్నారులకు హృదయ సంబంధిత సమస్యలపై నిపుణులచే పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన...