manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 3:37 pm Posted by : Mana Praja Prathinidhi

బీఆర్ఎస్లోకి యువ కెరటం

_ఓజో ఫౌండేషన్తో ప్రజలకు సుపరిచితుడు
_సేవా కార్యక్రమాల్లో రఘు తనదైన ముద్ర
_హుజూర్ నగర్ బీఆర్ఎస్ లో రఘు జోష్
_26న కేటీఆర్ సమక్షంలో చేరనున్న పిల్లుట్ల రఘు చేరికకు ముహూర్తం ఖరారు

మనప్రజాప్రతినిధి//హుజూర్ నగర్,

ముద్ర వేసుకొని హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైనయాతవాకిళ్ళ గ్రామ కు చెందిన పిల్లుట్ల రఘు, ఓజో ఫౌండేషన్ స్థాపించి గ్రామాలలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాల పంపిణీ అన్నదాన కార్యక్రమాలు నిరుద్యోగ యువతీ. యువకులకు సుమారు 1000 మందిపై గ విద్యార్థులకు కాంపిటేషన్ పుస్తకాల పంపిణీ చేశారు దేవాలయాల పాఠశాలల అభివృద్ధికి చేయూత అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ఆర్ధిక సహాయాలు చేసి హుజూర్ నగర్ మఠంపల్లి గరిడేపల్లి నేరేడుచర్ల మేళ్లచెరువు చింతలపాలెం పాలకవీడుమండలాల ప్రజల నోటా రఘు అనే పేరు అందరి నోట పిలిపించుకునే విధంగా సేవా కార్యక్రమాలు చేశారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ప్రధాన పార్టీలకు దీటుగా హోరా హోరిగా ప్రచారాలు చేశాడు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో బీ ఆర్ఎస్ లో చేరికకు రంగం సిద్ధం చేశారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాజీ ఎంపీ బడుగు లింగ యాదవ్ నియోజకవర్గ ఇన్చార్జి వంటెద్దు నరసింహారెడ్డి సహకారంతో ఈనెల 26న హైదరాబాదులోని తెలంగాణ భవనంలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు రఘు చేరికతో హుజూర్ నగర్ బీ ఆర్ఎస్ లో యువ కెరటం చేరికతో నియోజకవర్గంలో పార్టీ సమీకరణాలు మారనున్నాయి